Header Banner

భవతీ భిక్షాందేహి! ఇదేం టైటిల్‌ మావ? షాక్ అయ్యారా నిజమేనండి!

  Sun Jun 08, 2025 13:00        Cinemas

సినిమా విజయంలో టైటిల్ పాత్ర ఎంతో కీలకమని అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో దర్శకులు టైటిల్ విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, అన్ని భాషలకు సరిపోయేలా పాన్ ఇండియా రేంజ్‌లో టైటిల్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన టైటిల్ పట్ల చర్చ జరుగుతోంది. విజయ్ సేతుపతి, టబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మొదట "బెగ్గర్‌" అనే టైటిల్‌ను పరిశీలించారు. అయితే తమిళనాట ఇంగ్లీష్ టైటిల్స్‌కు ఎక్కువ రీచ్ లేకపోవడంతో పాటు, టైటిల్‌పై అక్కడి నియమాలు కఠినంగా ఉండటంతో విజయ్ సేతుపతి సలహా మేరకు “భవతీ భిక్షాందేహి” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.

 

ఇది కూడా చదవండి: కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని వాయిదా.. త్వరలో ట్రైలర్!

 

ఈ టైటిల్‌ అన్ని భాషలకు సూట్ అయ్యే విధంగా ఉండటంతో, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కథ ఓ బెగ్గర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు సిరీస్ సినిమాల విజయాల నేపథ్యంలో, ఈ సినిమా కూడా ఆ తరహాలోనే హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే "భవతీ భిక్షాందేహి" అనే టైటిల్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తే, మరికొందరు పూరి వినూత్నంగా ఆలోచించాడని మెచ్చుకుంటున్నారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. పూరి గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా పట్ల అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

 

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీకి వస్తోన్న గూగుల్.. అక్కడ 143 ఎకరాల్లో ఏర్పాటు.. ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #BhavatiBhikshandehi #VijaySethupathi #PuriJagannadh #Tabu #IndianCinema #PanIndiaMovie #UpcomingMovies2025 #MovieTitles #TollywoodUpdates #KollywoodNews #FilmBuzz #OTTAndTheatrical #BeggarMovieConcept #CreativeTitles #VijaySethupathiNewMovie